గిరిజన సలహా మండలి కావాల్సిందే..!

 ప్రతిపక్ష నేత , వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో కలిసి
గవర్నర్‌ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిశారు.  రెండు ప్రధానాంశాలపై   వినతి
పత్రాలు సమర్పించారు. ఇందులో ప్రధానంగా గిరిజనుల సలహా మండలి ఏర్పాటు చేయాలని, కాల్ మనీ అంశంపై చర్యలు
తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ గిరిజన మండలి గురించి, గిరిజన
ఎమ్మెల్యేలపై పెడుతున్న దొంగ కేసులపై ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం..

గిరిజన సలహా మండలి అన్నది గిరిజన ప్రాంతంలో ఏ
అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు హక్కుగా
రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ఇచ్చిన వరం. కానీ,  చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు తాను అన్యాయంగా, గిరిజనులకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలకు
అడ్డువస్తుందని కమిటీ వేయడం లేదు. ఈ కమిటీలో మూడు వంతులు గిరిజన ఎమ్మెల్యేలే
సభ్యులుగా ఉండాలి. ఇది రాజ్యాంగం ప్రకారం జరగాలి. 
ఏడు గిరిజన స్థానాలుంటే, అందులో ఆరింటిలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి, వాళ్లు బాక్సైట్ విషయంలో అడ్డు తగులుతారని
కమిటీ నియామకాన్నే వదిలేశారు. ఇది రాజ్యాంగం ప్రకారం కచ్చితంగా వేయాల్సిన కమిటీ. అందుకే
గవర్నర్ గారికి నేరుగా ఈ విషయాన్ని వివరించి, ఆయనను జోక్యం చేసుకోవాలని కోరాం.

గిరిజన మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బాక్సైట్
తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన సమావేశంలో.. ప్రతి గిరిజనుడు తమ సంప్రదాయ ఆయుధాలతో
చంద్రబాబు తల నరుకుతారని అన్నందుకు 307 హత్యాయత్నం కేసు పెట్టి గిరిజన మహిళను
వేధిస్తున్నారు. ఆ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.

చంద్రబాబు ఎన్నిసార్లు వేలు చూపిస్తూ నీ
అంతుచూస్తా అని అన్నాడు? అంటే మా అందరినీ చంపేస్తామనే కదా అర్థం.. మరి
ఆయనమీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టడంలేదు?

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనను
వ్యతిరేకించారని, ఆయన పావురాల గుట్టలో పావురం అయిపోయారని చంద్రబాబు
ఓ సందర్భంలో అన్నారు. అంటే రాజశేఖరరెడ్డిని చంద్రబాబే చంపించాడని అనుకోవాలా? ఆ కోణంలో ఎందుకు విచారణ జరిపించలేదు? ఆయనమీద 307 సెక్షన్ కింద ఎందుకు కేసు పెట్టలేదు?అసెంబ్లీకి నువ్వొస్తే కదా అని అంతకుముందు కూడా చంద్రబాబు అన్నారు.. సరిగ్గా
రెండు రోజుల తర్వాత రాజశేఖరరెడ్డి చనిపోయారు. అంటే, చంద్రబాబు చంపించినట్లు కాదా? మరి చంద్రబాబు
మీద ఎందుకు కేసు పెట్టలేదు. సీబీ ఐ ఈ దిశగా ఎందుకు దర్యాప్తు చేయటం లేదు.

తిరుపతి విమానాశ్రయంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు. అక్కడ 19 మంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే, వాళ్లకు తోడుగా నిలబడి, ఎయిర్‌పోర్టు మేనేజర్‌ను నిలదీస్తే కూడా తప్పు.
తర్వాత ఆ మేనేజర్ ఆ 19 మందిని పంపుతూ, ఎంపీకి, ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పారు. అయినా.. మళ్లీ
ఆరోజు రాత్రి చంద్రబాబు అక్కడకు తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టు మేనేజర్‌తో కేసు
పెట్టించారు. ఒక వేళ నిజంగా వాళ్లు కొడితే సీసీ టీవీ కెమెరాలో రికార్డు కాదా..
దాన్ని ఎందుకు చూపించలేదు?అంటే అది దొంగ కేసు అనే కదా.. 19 మంది ప్రయాణికులు  ఫిర్యాదుచేసిన విషయం ఎందుకు బయటపెట్టలేదు?

దీంతో పాటు కాల్ మనీ కేసులో చంద్రబాబు వైఖరిని వైఎస్ జగన్
తూర్పార బట్టారు. ఈ రెండు అంశాలపై సమర్పించిన వినతి పత్రాన్ని గవర్నర్ కు
సమర్పించారు.

 

Back to Top