వైయస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా మెగా వైద్యశిబిరాలు
అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ  ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, 17వ తేదీ సోమవారం ప్రకాశం జిల్లా కొండేపి, 18వ తేదీ మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం, 19వ తేదీ బుధవారం ప్రకాశం జిల్లా చీరాల, 20వ తేదీ విశాఖపట్నం, విజయవాడ నగరాలలో, 21వ తేదీ పలాస, నగరి, 22వ తేదీ శనివారం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ప్రాంతంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శివభరత్‌రెడ్డి వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
 
Back to Top