మీరు జగనన్న కోసం, జగనన్న మీ కోసం...

బ్రాహ్మణపల్లి

30 అక్టోబర్ 2012 : మీరంతా జగనన్న కోసం ఆలోచిస్తుంటే, జగనన్న మీ కోసం ఆలోచిస్తున్నాడని షర్మిల అన్నారు. "మీరున్నారన్నదే మా ధైర్యం. జగనన్నకు మీరే ధైర్యం" అని వ్యాఖ్యానించారు. తన 13 వ రోజు పాదయాత్రలో భాగంగా  ఆమె మంగళవారం అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో మహిళలతో కాసేపు మాట్లాడారు. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై జగనన్నను బెయిలు  కూడా రానివ్వకుండా జైలు పాలు చేశారని ఆమె విమర్శించారు. జగనన్న మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనే కక్షతోనే కుట్రలు చేసి కేసులు వేసి జైలుకు పంపారని షర్మిల ఆరోపించారు. అన్నిటా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి వెంటనే దించేందుకు కావలసిన ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ పని చేయకుండా పాదయాత్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. 90 మంది ఎమ్మెల్యేలుండగా అవిశ్వాసతీర్మానం పెట్టకుండా ఈ యాత్ర లెందుకని ఆమె నిలదీశారు. చంద్రబాబు నీచ రాజకీయాలపై షర్మిల నిప్పులు చెరిగారు.

షర్మిల పదమూడవ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం పది గంటలకు కళ్యాణదుర్గం బైపాస్ నుంచి ప్రారంభించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు అశేష సంఖ్యలో వెంట నడువగా జై జగన్ నినాదాల మధ్య ఆమె పాదయాత్ర మొదలైంది. పిల్లిగుండ్ల కాలనీ, రాజశేఖర్‌రెడ్డి నగర్, సిండికేట్ నగర్ మీదగా మధ్యాహ్నానికి రూట్ పబ్లిక్ స్కూల్ వద్దకు షర్మిల పాదయాత్ర చేరింది. సిండికేట్‌ నగర్‌లోని చౌడమ్మ దేవాలయంలో షర్మిల ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
మధ్యాహ్న భోజన విరామం అనంతరం రాచానపల్లి, ఉరవకొండ నియోజకవర్గం లెప్రసీ కాలనీ మీదగా బొద్కూరు క్రాస్, బ్రాహ్మణపల్లి, కమ్మూరు క్రాస్ చేరుకున్నారు. షర్మిల మంగళవారం రాత్రి కమ్మూరు క్రాస్‌ వద్ద బసచేస్తున్నారు. మంగళవారంనాడు షర్మిల మొత్తం 12.9 కిలోమీటర్లు నడిచారు. మంగళవారం రాత్రి వరకూ షర్మిల 176.3 కిలోమీటర్లు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు. 


తాజా వీడియోలు

Back to Top