వైయస్‌ జగన్‌కు వైద్య విద్యార్థుల పూర్తి మద్దతు

చిత్తూరు, 1 డిసెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సమైక్య శంఖారావం యాత్రకు వివిధ వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. యువకులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తరలివచ్చి శ్రీ జగన్‌కు మద్దతు తెలియజేస్తున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని వైద్య కళాశాల విద్యార్థులు కలసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం శ్రీ వైయస్ జగ‌న్ చేస్తున్న పోరాటాన్ని వారు ప్రశంసించారు. ‌రాష్ట్రం విడిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను శ్రీ జగన్కు వివరించామని, ఆయన తాము చెప్పినది ఓపి‌కగా విన్నారని విద్యార్థులు చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.‌

సంక్షేమ, అభివృద్ధి పథకాలు సక్రమంగా అమలు కావాలన్నా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నా శ్రీ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని, వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని విద్యార్థులు చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top