మరో ప్రజాప్రస్థానం ఓ పెను తుపాను

తిరుపతి:

మహానేత తనయ వైయస్ షర్మిల రాష్ట్ర రాజకీయాలలో పెనుతుపాను సృష్టిస్తుందని తిరుపతి ఎమ్మల్యే భూమన కరుణాకర్ రెడ్డి  చెప్పారు.  ఆమె ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి యాత్ర చేస్తుంటే.. చంద్రబాబు అధికారం కోసం యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాద యాత్రకు షర్మిల యాత్రకూ పోలికే లేదన్నారు. 2003లో వైయస్ పాదయాత్రలో నేనూ పాల్గొన్నాననీ, అప్పటికంటె ఇప్పుడు రెట్టింపు స్పందన లభిస్తోందనీ ఆయన చెప్పారు. ప్రజల సమస్యలను షర్మిల స్వయంగా తెలుసుకుంటున్నారనీ,వారితో మమేకమవుతున్నారనీ భూమన తెలిపారు.

Back to Top