మరో ప్రజాప్రస్థానానికి న్యాయవాదుల సంఘీభావం

బెల్లంకొండ (గుంటూరు జిల్లా) : మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు న్యాయవాది వై.నాగిరెడ్డి, వైయస్‌ఆర్‌సిపి న్యాయ విభాగం జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారు. బెల్లంకొండ నుంచి రాజుపా‌లానికి శ్రీమతి షర్మిల నడుస్తుండగా మార్గమధ్యలో న్యాయవాదులు ర్యాలీగా తరలివచ్చి ఆమె అడుగులో అడుగు వేశారు. తమ సమస్యలను శ్రీమతి షర్మిల దృష్టికి తెచ్చారు.

న్యాయవాదుల బార్ కౌన్సి‌ల్ సభ్యుడు వి.బ్రహ్మారెడ్డి, ఎ‌న్.‌ జింబో, దేవరాజ్, బి.కిషో‌ర్, కె.సి.వి.రామ‌న్, వి.వి.రెడ్డి, కె.శ్యామల, రాజశేఖరరెడ్డి, అంకమ్మరావు, సుహాసిని, లత, వరదాయని, ఏసుకుమారి, వెంకటేశ్వర్లు, హబీ‌బ్, సత్యనారాయణ, సూరిబాబు, శశికిర‌ణ్, పొన్నూరు బా‌ర్ కౌన్సిల్ నుంచి రాజారావు, చిట్టిబాబు, ప్రకా‌ష్, బంటి, తెనాలి బా‌ర్ కౌన్సి‌ల్ నుంచి కృష్ణారెడ్డి, రాజారావు, బాబా‌ వలి, మల్లికార్జునరెడ్డి, శివనాగేశ్వరరావు పాల్గొన్నారు.
Back to Top