మంత్రి ఆనంకు మతి భ్రమించింది: కొరముట్ల

తిరుపతి, 13 ఏప్రిల్‌ 2013: ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మతి భ్రమించిందని వైయస్‌ఆర్‌ పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు.‌ మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి పెట్టిన భిక్షతోనే ఆనం మంత్రి పదవిని అనుభవిస్తున్న విషయాన్ని మరిపోవద్దని అన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ కుటుంబంపై ఆనం చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంత్రి ఆనం వెంటనే క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఆనం రామనారాయణరెడ్డి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారిస్తే ఆ పదవి తనకు వస్తుందన్న ఆశతోనే ఆనం ఈ విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Back to Top