మక్తల్‌ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర

మక్తల్‌ (మహబూబ్‌నగర్‌ జిల్లా), 29 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాడు మక్తల్‌ నియోజకవర్గంలో ప్రారంభమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. ఆలంపురం, గద్వాల నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకున్న షర్మిల జూరాల ప్రాజెక్టు నుంచి మక్తల్‌ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిలకు మక్తల్‌ నియోజకవర్గం ప్రజలు, వైయస్ అభిమానులు‌, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తమ అభిమాన నేత దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రాంతంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది.

Back to Top