యువభేరిని విజయవంతం చేయండి

–ఇరువురి నాయుళ్ళ మోసాన్ని ఎండగట్టాలి
–ధ్వజమెత్తిన ఎమ్మేల్యే ఆర్కే

మంగళగిరిః రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించటంలో కేంద్రం వద్ద రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెట్టిన ఇరువురు నాయుళ్ళు చంద్రబాబు, వెంకయ్యనాయుడుల మోసాన్ని ఎండగట్టేందుకు ఈ నెల 16వ తేది గురువారం గుంటూరులో జరగనున్న యువభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యువత పెద్దఎత్తున తరలి రావాలని ఎమ్మేల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) పిలుపు నిచ్చారు.  పట్టణంలోని కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత ఎన్నికల సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా రాష్ట్రనికి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించగా,  ఐదేళ్లుకాదు పదేళ్లు కావాలని వెంకయ్యనాయుడు పదికాదు పదిహేను ఏళ్లు కావాలని చెప్పిన చంద్రబాబు...  మేము అధికారంలో వస్తే వెంటనే ప్రత్యేకహోదా ఇస్తామని హమీ ఇచ్చిన నరేంద్రమోడి రాష్ట్ర ప్రజలను మోసగించి ఓట్లు వెయించుకున్నారని ధ్వజమెత్తారు.  రాష్ట్ర ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయటడమే కాక రాష్ట్రన్ని అధోగతిపాలు చేశారని విమర్శించారు. 

కేవలం కమిషన్‌లకోసం కక్కుర్తిపడి ప్యాకేజికి ఒప్పుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల గౌరవన్ని విస్మరించారన్నారు. ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసు నుండి తాను తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రజల గౌరవరన్ని తెలంగాణ,  కేంద్రప్రభుత్వాల వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. హోదా సాధిస్తేనే రాష్ట్రనికి పరిశ్రమలు రావటంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. హోదా  సాధన కొరకు పోరాడుతున్న  వైయస్సార్‌కాంగ్రెపార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డికి పార్టీలకతీతంగా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి యువభేరి కార్యక్రమాన్ని మద్దత్తు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తమ స్వప్రయోజనాలను విడనాడి ప్రత్యేకహోదా కోసం కృషి చేయకపోతే భవిష్యత్‌ తరాలు క్షమించవని హితవు పలికారు.

Back to Top