<strong>అనంతపురం</strong>: హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలనే డిమాండ్‌తో వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మహాధర్నా చేపడుతామని ఆ పార్టీ ఎమ్మెల్యే వై. విశ‍్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహాధర్నా చేయనున్నట్టు తెలిపారు.<br/>శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్ఆర్ పూర్తిచేసిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పూర్తి చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షాలను శత్రువులుగా చూస్తున్నారని వై విశ‍్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. <br/>