మదనపల్లెలో మౌన ప్రదర్శన

మదనపల్లె:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ మదనపల్లెలో మంగళవారం మౌనప్రదర్శన చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, రోడ్డుపై బైఠాయించారు. టూటౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి మౌన దీక్షను భగ్నంచేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు.

Back to Top