మారేడుబాక నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

మారేడుబాక (తూ.గో. జిల్లా),

10 జూన్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఆమె మండపేట నియోజకవర్గం మారేడుబాక నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మారేడుబాకలో అంబేద్కర్ విగ్రహానికి‌ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పూలమాల వేశారు. అక్కడి నుంచి శ్రీమతి షర్మిల పులగుర్త చేరుకున్నారు. దారిపొడవునా ప్రజలు శ్రీమతి షర్మిల పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. రాజన్న తనయకు నీరాజనాలు పలికారు.

అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న శ్రీమతి షర్మిల పులగుర్త నుంచి మాచవరం చేరుకుంటారు. భోజన విరామం తరువాత ఆమె పసలపూడి, వైయస్‌ఆర్ బొమ్మ - బైపా‌స్ సెంట‌ర్ మీదుగా రామచంద్రపురం చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు.

Back to Top