మామిడికి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలి


చిత్తూరు:  మామిడి పంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ఎదుట రైతులు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మాట్లాడుతూ.. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేకుండా పోయింద‌న్నారు. ఒక‌వైపు వ‌ర్షాభావ ప‌రిస్థితులు, మ‌రో వైపు పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు.
Back to Top