ఏపీకి తీవ్ర అన్యాయం- వైవీ సుబ్బారెడ్డి

ఢిల్లీ: ఆంధ్ర‌రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన‌
బ‌డ్జెట్‌లో ఏపీకి స‌రైన ప్రాధాన్య‌త ద‌క్క‌లేద‌నిఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బుధ‌వారం మీడియాతో మాట్లాడిన వైవీ ..ఏపీకి రైల్వే జోన్ కేటాయించ‌లేద‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు త‌న కుమారుడిని ఎలా సీఎం చేయాల‌ని ఆలోచిస్తున్నారే త‌ప్ప‌..ఆయ‌న‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌త్యేక హోదా  సాధ‌న‌కు ఉద్య‌మం ఉధృతం చేస్తామ‌ని సుబ్బారెడ్డి హెచ్చ‌రించారు.

తాజా ఫోటోలు

Back to Top