వైయస్‌ జగన్‌ పాదయాత్రకు హైకోర్టు న్యాయవాదులు

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, టీడీపీ అప్రజాస్వామిక పాలనను ఎండగట్టేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. గత నెల 6వ తేదీన ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ 30వ రోజుకు చేరింది. వైయస్‌ఆర్‌ జిల్లా, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చే సిన వైయస్‌ జగన్‌ అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారు. వైయస్‌ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు హైకోర్టు న్యాయవాదులు హైదరాబాద్‌ నుంచి బస్సులో బయలుదేరారు. లక్డికపూల్‌ నుంచి 50 మంది న్యాయవాదులు శనివారం అనంతపురం జిల్లాకు పయనమయ్యారు. తాము కూడా జననేతకు తోడుగా ఉంటామని హైకోర్టు న్యాయవాదులు పేర్కొన్నారు.
 
Back to Top