మహబూబ్‌నగర్: 2 డిసెంబర్ 2012 : 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని లాల్‌కోటలో శ్రీమతి షర్మిల ఆదివారం రచ్చబండ నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు, రైతులు, మహిళలు షర్మిలతో తమ కష్టాలు చెప్పుకున్నారు. చంద్రకళ అనే విద్యార్థిని తమకు కాలేజీ వెళ్లడానికి బస్సులు సమయానికి రావడం లేదని ఫిర్యాదు చేసింది. ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి కానీ ఆర్డినరీ బస్సులు సరిగా ఉండడం లేదని ఆ విద్యార్థిని వాపోయింది. రచ్చబండలో పాలమూరు కళాకారుల కష్టాలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. కళాకారుల కోరిక మేరక కాస్సేపు డప్పు వాయించి అందరినీ అలరించారు. 'పేదల పెన్నిధి షర్మిలక్క వచ్చెరా మన పల్లెకు...' అంటూ కళాకారులు పాటలు పాడి అందరిలో ఉత్సాహం నింపారు. షర్మిలకు పాటతో స్వాగతం పలికారు. ఇదిలావుండగా మంచినీరు రావడం లేదని, కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని షర్మిలతో స్థానికులు వాపోయారు. మహానేత వైయస్ ఉన్నప్పుడు బ్యాంకు రుణాలు మాఫీ చేశారని, ఇప్పడు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ హయాంలో అందిన అన్ని సదుపాయాలూ నేడు తమకు దూరమయ్యాయని వారు వాపోయారు. వారిని ఓదార్చిన షర్మిల రాజన్న రాజ్యంతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయన్నారు.ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదనీ, మంజూరైన ఇళ్లకు కూడా బిల్లులు రావడం లేదనీ స్థానికులు చెప్పారు. దీనికి ప్రతిస్పందిన షర్మిల, నాడు దివంగత మహానేత వైయస్ హయాంలో రాష్ట్రంలో 45 లక్షల ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. జగనన్న సిఎం అయ్యాక పక్కాఇళ్ల సమస్య పరిష్కారం అవుతుందన్నారు.రాజన్నరాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలని ఆమె వారిని ఓదార్చారు. శ్రీమతి షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' ఆదివారం ఉదయం నెల్లికొండి గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది