కుమ్మక్కు రాజకీయాలపై ఎమ్మెల్యే నిరసన

అనంతపురం:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ అక్రమంగా అరెస్టు చేశారని ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆరోపించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కుట్రలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి గీతామందిరం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు, మహానేత అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గురునాథరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుయుక్తులు పన్నినా శ్రీ జగన్మోహనరెడ్డిని ఎవరూ ఆపలేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవడమే కాకుండా శ్రీ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. శ్రీ వైఎస్ జగన్‌మోహనరెడ్డి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  జననేత శ్రీ జగన్మోహనరెడ్డిపై అభిమానం చెక్కుచెదరలేదని చాటి చెప్పారు. అన్న, రక్తదాన శిబిరాలు, రోగులకు పాలు, విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నుల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. .

Back to Top