దమ్ముంటే ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించాలి

తూర్పుగోదావరి: పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి చంద్రబాబు ఎన్నికలకు రావాలని తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు సవాలు విసిరారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంత ప్రజలంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే ఉన్నారని ఆయన అన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీలోకి వెళ్లినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. చంద్రబాబుకు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దమ్మూ, ధైర్యం ఉంటే వారితో రాజీనామా చేయించాలని వైయస్‌ జగన్‌ ఇప్పటికే సవాలు విసిరారన్నారు. ఎవరికి ప్రజా ఆమోదం ఉందో తేల్చుకోవాలన్నారు. 
Back to Top