కలెక్టరు దృష్టికి చీనీ రైతుల సమస్యలు

పులివెందుల, 26 ఏప్రిల్ 2013:

అరటి, చీని రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే శ్రీమతి వైయస్ విజయమ్మ కలెక్టరును కోరారు. శుక్రవారం పులివెందులలో ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అరటి, చినీ రైతులు ప్రజా దర్బారులో ఆమెకు తమ గోడు చెప్పుకున్నారు.  స్పందించిన ఆమె వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై శ్రీమతి విజయమ్మకు వినతిపత్రాలు ఇచ్చారు. వాటన్నింటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఉద్యానవన రైతులు ఇంతగా ఎప్పుడూ కష్టపడలేదని రైతులు చెప్పారు. ఈ విషయాన్ని విజయమ్మగారి దృష్టికి తీసుకెళ్ళామన్నారు.

Back to Top