కాకినాడ ప్రజలు టీడీపికి బుద్ధి చెప్పాలి

కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధిస్తుందని  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు.  అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం పాటించామన్నారు. పార్టీ అభిప్రాయాలను స్థానిక నేతలు, కార్యకర్తలు స్వాగతించారన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం విస్తృతస్థాయిలో అభిప్రాయాలు సేకరించామని ధర్మాన తెలిపారు. చంద్రబాబు మూడున్నరేళ్ల దుర్మార్గ పాలనపై తీర్పిచ్చే సమయం ఆసన్నమైందన్నారు. కాకినాడ ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ధర్మాన పిలుపునిచ్చారు. ప్రజలు, ప్రతిపక్షాలు, అధికారులకు తెలియకుండా టీడీపీ సర్కార్‌ రహస్యంగా వందలాది జీవోలు జారీ చేయడం దారుణమన్నారు.
 
అంతకు ముందు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ  విజయసాయిరెడ్డి.. అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులకు బీ ఫారాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, కురసాల కన్నబాబు, చెలమలశెట్టి సునీల్‌, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ముత్తా శశిధర్‌, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Back to Top