కేటీపీపీ కార్మిక సమస్యలపై నిరశన: సురేఖ

వరంగల్, 16 మే 2013:

వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని కేటీపీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని  వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆమె హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం ధర్నా చేస్తున్న కార్మికులను గురువారం కొండా సురేఖ, మురళి దంపతులు పరామర్ఙంచారు. వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురేఖ పైమేరకు హెచ్చరిక చేశారు.

Back to Top