చంద్రబాబుపై సుమోటో కేసు నమోదు చేయాలి


హైదరాబాద్) చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పాలనపై వైఎస్సార్ సీపీ సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమై చర్చించారు. అనంతరం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్  జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన రుణ మాఫీ మోసంతో లక్షల మంది రైతులు అప్పుల పాలై పోయారు. రాష్ట్రంలో 632 మంది రైతులు గత ఏడాది కాలంలో ఆత్మహత్యలు చేసుకొన్నారని కేంద్ర ప్రభుత్వం నివేదిక లో వెల్లడించింది. ఈ రైతు ఆత్మహత్యలకు మూలకారణం చంద్రబాబు చేసిన మోసమే కాబట్టి ఆయనపై హై కోర్టు లేదా సుప్రీం కోర్టు సుమోటో గా కేసు నమోదు చేయాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 లక్షల మంది పెన్షన్లను ప్రభుత్వం కత్తిరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చేతల ప్రభుత్వం కాదని, కోతల ప్రభుత్వం అని జ్యోతుల అభివర్ణించారు.
Back to Top