రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు..!

రాయలసీమకు నీరిచ్చేందుకు వైఎస్ పరితపించేవారు..!
హైదరాబాద్: రాయలసీమకు నీరిచ్చేందుకు వైఎస్సార్ ఎంతో పరితపించేవారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో ప్రాజెక్ట్ లు చేపట్టి రాయలసీమకు నీరిచ్చారని అసెంబ్లీలో జరిగిన చర్చలో నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ, చంద్రబాబు వాస్తవాలు వక్రీకరించి మీమే ఇచ్చామన్నట్లు చెప్పుకుంటున్నారని నెహ్రూ అన్నారు.  పట్టిసీమ  ద్వారా నీళ్ల మళ్లింపు దుర్మార్గమైన ఆలోచన అన్నారు.  

ధనార్జన కోసమే పట్టిసీమ ప్రాజెక్ట్..
పట్టిసీమ పేరుతో ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని నెహ్రు అన్నారు. ప్రాజెక్ట్ లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని  ఆరోపించారు. ధనార్జన కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్ట్ ను చేపడుతున్నారని విమర్శించారు. హెడ్ వర్క్ పూర్తికాకుండానే చంద్రబాబు పట్టిసీమను జాతికి ఎలా అంకితమిస్తారని నెహ్రు ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణం కుట్రపూరితమన్నారు. రాయలసీమకు నీరివ్వాలనే ఉద్దేశ్యంతోనే వైఎస్సార్సీపీ బస్సుయాత్ర కూడా చేపట్టిందన్నారు.  కానీ చంద్రబాబు మాత్రం వాస్తవాలు వక్రీకరించి రాయలసీమ ప్రజానీకాన్ని మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. 
Back to Top