<strong>శ్రీకాకుళం:</strong> జన్మభూమి కమిటీ సభ్యులు దాడులకు తెగబడుతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ కమిటీ సభ్యుడు జననేతను కలిసి కన్నీరుపెట్టుకున్నారు. పాలకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని వంగర మండలం, ఎం సీతాపురానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కలిశారు. తనపై జన్మభూమి కమిటీ సభ్యులు అకారణంగా దాడులు చేస్తున్నారని గోడు వెల్లబోసుకున్నాడు. <strong>1200 మంది పెన్షన్లు తీసేశారు..</strong>సంతకవిటి మండలం జన్మభూమి కమిటీ బాధితులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. అర్హులైన 1200 మందికి టీడీపీ నేతలు పెన్షన్ తీసేశారని, తీసేసిన పెన్షన్లను టీడీపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు.