అధ్యయనం అనంతరం డిక్లరేషన్‌విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ అధ్యయన సమావేశం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు, బీసీ అధ్యయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసిన అనంతరం వైయస్‌ జగన్‌ను కలుస్తామన్నారు. నివేదిక ఆధారంగా బీసీ గర్జనలో  వైయస్‌ జగన్‌ డిక్లరేషన్‌ ప్రకటిస్తారన్నారు. చంద్రాబు పాలన బీసీలకు సంక్షేమ పథకాలు అందడం లేదని జంగా కృష్ణమూర్తి విమర్శించారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నారని మండిపడ్డారు. 
Back to Top