హైదరాబాద్, 27 సెప్టెంబర్ 2012: జననేత, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి వెంటనే బెయిల్ లభించి, ప్రజల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ గురువారం హైదరాబాద్‌లో ఐదు రకాల హోమాలు చేశారు. హైదరాబాద్ శివారులోని నానక్‌రామ్‌గూడలోని శ్రీ శివ మహంకాళి నుమంతగిరి క్షేత్రంలో వైయస్‌ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ఈ హోమాలు నిర్వహించారు.<br/>ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీ శనీశ్వరాలయ ప్రధాన అర్చకుడు చంద్రభాస్కర శాస్త్రి పర్యవేక్షణలో 18 మంది వేద పండితులు శ్రీ లక్ష్మీగణపతి మూలమంత్ర హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, సుదర్శన పారాయణ హోమం, శ్రీ చండీ పారాయణ హోమం చేశారు. ఎనిమిది చిన్న హోమ గుండాలు, ఒక భారీ హోమగుండం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏకకాలంలో హోమాలను ప్రారంభించారు. వైయస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని హోమం నిర్వహించారు.