హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వారం ప్రచారంతో బిజీ బిజీ గా గడపనున్నారు. మొదటి నాలుగురోజులూ పూర్తిగా వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. తొర్రూరు, పరకాల బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ కు బయలుదేరి వెళ్లారు. పాలకుర్తికి చేరుకొని అక్కడి నుంచి జఫర్ గఢ్, వర్ధన్న పేట, రాయపర్తి, తొర్రూరు, హన్మకొండ ల మీదుగా.. 101 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించ నున్నారు. సోమవారం సాయంత్రం తొర్రూరు లో బహిరంగ సభలో పాల్గొంటారు. రెండో రోజు పర్యటనలో భాగంగా హన్మకొండ, ఆత్మకూరు, శాయంపేట, రేగొండ, భూపాలపల్లి, పరకాల, హన్మకొండ ల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం పరకాల లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బుధవారం హన్మకొండతో పాటు, సంగెం, గీసుకొండ ప్రాంతాల్లో ప్రచారం మీద ద్రష్టి పెడతారు. గురువారం హన్మకొండ నుంచి నయీం నగర్, కేయూ క్రాస్ రోడ్, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, స్టేషన్ ఘన్ పూర్, రఘునాథ్ పల్లి లలో ప్రచారం నిర్వహిస్తారు. పార్టీ అధ్యక్షులు జగన్ రాకతో ప్రచారం ఊపందుకొంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.