జగన్‌తోనే బీసీలకు న్యాయం: రేవతి

నరసరావుపేట:

రాష్ట్రంలో వైయస్. జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోనే తమకు న్యాయం జరుగుతుందని బీసీలు అందరూ భావిస్తున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ దేవళ్ళ రేవతి చెప్పారు. పలనాడురోడ్డులోని కాకుమాను పౌండేషన్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో 50శాతానికి పైగా ఉన్న బీసీలను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇప్పటివరకు ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారేగానీ వారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నారు. బీసీలకు శాసనమండలి, రాజ్యసభ పదవులను కేటాయించకుండా వందలకోట్ల రూపాయలకు అమ్ముకున్న ఘనత ఆ రెండుపార్టీలకు దక్కుతుందన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన.. మహానేత వైయస్.రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి బీసీల ఆదరణ పొంది ముఖ్యమంత్రి అయినట్లుగానే తానుకూడా సీఎం కావాలని కలలు కంటూ చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. బీసీలకు వందసీట్లంటూ చంద్రబాబు దొంగ జపం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రైతులు, బీసీలను పట్టించుకోకుండా హైటెక్ పాలన పేరుతో రాష్ట్రాన్ని అథోగతి పట్టించారని మండిపడ్డారు. వైయస్ఆర్ పాలనలో అందరూ సుఖసంతోషాలతో ఉండగా, నేడు అధిక ధరలు, విద్యుత్ కోతలతో అల్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ వైఎస్.రాజశేఖరరెడ్డి మాదిరిగానే కార్యశీలత, పట్టుదల ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారన్నారు.

Back to Top