'జగన్ ప్రభంజనంలో పార్టీలు గల్లంతే'

కోడూరు (కృష్ణా జిల్లా):

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనం మధ్య పుట్టిందని, ఆ ప్రజాదరణను ఏ శక్తులు అడ్డుకోలేవని పార్టీ కేంద్ర పాలక మండలి కార్యనిర్వాహక సభ్యుడు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరావు అన్నారు. రానున్న రోజుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని చూడటం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం వంటిదేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ముందు ఇతర పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజాప్రస్థానం' యాత్రకు మద్దతుగా కోడూరులోని పార్టీ కార్యాలయం నుంచి స్థానిక నేతలతో కలిసి నాగేశ్వరరావు ఆదివారంనాడు పాదయాత్ర నిర్వహించారు. తొలుత మెరకగౌడపాలెంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుక్కల నాగేశ్వరరావు నిర్వహించిన పాదయాత్రలో కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top