'జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఆ పార్టీలకు లేదు'

ఒంగోలు, 28 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌, టిడిపిలకు లేదని పార్టీ విప్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్‌ బయటకు వస్తే ఆయన ప్రభంజనాన్ని తట్టుకోలేమనే ఆ పార్టీలు రెండూ కుమ్మక్కై కుట్ర చేసి జైలులో నిర్బంధించాయని ఆరోపించారు. జైలు నుంచి జగన్మోహన్‌రెడ్డిని బయటికి రానివ్వకుండా కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐ కుతంత్రాలు పన్నుతున్నాయని నిప్పులు చెరిగారు. జగన్పై జరుగుతున్న కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని‌, సమయం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెబుతారని బాలినేని అన్నారు. ఒంగోలులో బుధవారం జరిగిన జ్యోతిరావు ఫూలే వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి బాలినేని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో బాలినేని మాట్లాడారు.
Back to Top