జగన్ నేతృత్వంలో రాజన్న రాజ్యం‌ : రోజా

విజయవాడ, 5 సెప్టెంబర్‌ 2012 : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అరెస్టు విషయంలో అధికార కాంగ్రెస్‌ పార్టీని, కొల్లేరు వాసుల వలసల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి రోజా తూర్పారపట్టారు. రాష్ట్రంలో ఇక రానున్నది వైయస్‌ జగన్‌ రాజ్యమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ తీగ పవరేంటో దాన్ని పట్టుకుంటేనే తెలుస్తుందని ఆమె అన్నారు. జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తే కాని ఆయన పవర్ ఏంటో కాంగ్రె‌స్‌ ప్రభుత్వానికి తెలియరాలేదని రోజా ఎద్దేవా చేశారు. కొల్లేరు వలసలకు కారణం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన 120 జీవోయే అని రోజా దుయ్యబట్టారు. బీసీలపై ఇప్పుడు బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

Back to Top