జగన్ కోసం జనం సంతకం

మండపేట:

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వై.యస్. జగన్మోహన్‌ రెడ్డిపై కుట్ర రాజకీయాలకు ప్రజలు తమ నిరసన తెలిపారు. కక్షసాధింపు చర్యలు ఆపాలనీ, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలనీ రాష్ట్రపతిని కోరుతూ సంతకాలు చేశారు. అధికార, ప్రతిపక్షం ఏకమై శ్రీ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లేందుకు చేపట్టిన ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమం  తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ప్రారంభమైంది. స్థానిక రాజారత్న సెంటర్‌లోని వైయస్ఆర్ విగ్రహం వద్ద  వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ సమన్వయకర్త  మిండగుదిటి మోహన్, జిల్లా వాణిజ్య, కిసాన్‌ విభాగాల  కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు ఆర్‌వీవీ సత్యన్నారాయణచౌదరి, తాడి విజయభాస్కరరెడ్డి, పార్టీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. దారిన వెళుతున్న వారు సైతం ఆగి విషయం తెలుసుకుని సంతకాలు చేశారు. సంతకాలు చేసేందుకు జనం బారులు తీరారు. చిట్టబ్బాయి మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్‌కు లభిస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వం, ప్రతిపక్షం, సీబీఐతో కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసి 200 రోజులు పైబడినా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న తీరును రాష్ట్ర ప్రజానీకం గమనిస్తోందన్నారు. కుట్రరాజకీయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువేళ్లేందుకు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం.. జనం సంతకాల కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top