జగనన్నతోనే రాజన్న స్వర్ణ యుగం: షర్మిల

చింతలపూడి, 14 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రయితేనే మళ్లీ మహానేత డాక్టర్ వైయస్ఆర్  స్వర్ణ యుగం సాధ్యమవుతుందని శ్రీమతి వైయస్  షర్మిల  పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో మంగళవారం  నిర్వహించిన  రచ్చబండలో ఆమె  ప్రసంగించారు. జగనన్న ముఖ్యమంత్రయితే మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలిస్తారని చెప్పారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఉండవని హామీ ఇచ్చారు. కరెంట్ చార్జీలు పెంచడం, ఫీజు రియిబర్సుమెంట్కు తూట్లు పొడవటం,   మహానేత డాక్టర్ వైయస్ఆర్ పథకాలను నీరు గార్చడమే సంక్షేమమా? అని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.  పేదవారికి ఇళ్లు లేకపోవడమేనా సంక్షేమమంటే? సంక్షేమమంటే పేద విద్యార్థుల బస్ పాస్ రాయితీలు కుదించడమేనా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో కనీసం మూడు గంటలు కూడా విద్యుత్తు సరఫరా కావడం లేదని చెప్పారు. విద్యార్దుల బస్‌పాస్ చార్జీలు సైతం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్దులపై 300 కోట్ల రూపాయల భారం పడనుందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఉన్నప్పడు అందరికీ 7-9 గంటల విద్యుత్తు  ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. కిరణ్ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో నాలుగు సార్లు చార్జీలు పెంచి 30 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసిందన్నారు. వడ్డీ లేని రుణాలు ప్రచారానికి మాత్రమే పరిమితమైందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా లేదన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటమే దీనికి ప్రబల దృష్టాంతమన్నారు.

జగనన్న సీఎం అయి రాజన్న రాజ్యం వచ్చాక వికలాంగులు, వృద్ధులకు నెలనెలా పింఛన్లు ఇస్తారని భరోసా ఇచ్చారు. పేద పాఠశాలల విద్యార్థులకు ప్రతి నెల 500 రూపాయలు, ఇంటర్ విద్యార్థులకు 700, డిగ్రీ విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున ఇస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబుకు, కిరణ్కు బుద్ధి చెబితే రాబోయేది రాజన్న రాజ్యమేనని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.

Back to Top