జగనన్న నాయకత్వమే ప్రజల ఆకాంక్ష

షాద్‌నగర్

: రాష్ట్రప్రజలంతా ముక్తకంఠంతో వైయస్ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని ఆకాంక్షిస్తున్నారనీ, ఆయన నాయకత్వంలో త్వరలో రాజన్నరాజ్యం ఏర్పాటు తథ్యమనీ వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి స్పష్టంచేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి  పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర డిసెంబర్‌లో షాద్‌నగర్ నియోజకవర్గానికి వస్తున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్‌ఆర్ అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అంతకుముందు పట్టణంలోని ముఖ్యకూడలిలోగల వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Back to Top