వరద బాధితులకు వైఎస్ జగన్ అండదండలు


హైదరాబాద్) ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు
బాధ్యత గల ప్రతిపక్ష నేత గా వాళ్లకు అండదండలు అందించేందుకు వైఎస్ జగన్ ఎప్పుడు
ముందు ఉంటారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు వరదల్లో
చిక్కుకొన్నాయని తెలిసినప్పుడు పార్టీ శ్రేణుల్ని సహాయ చర్యల్లో నిమగ్నం చేశారు.
రెండు రోజుల పాటు వరద ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు.

. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టి
శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో బాధితులను జగన్ పరామర్శిస్తారు.  23వ తేదీ తొలి రోజునశ్రీకాళహస్తి నియోజకవర్గంలో, వైఎస్సార్ జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రాంతాల్లో
పర్యటిస్తారు. అదే రోజు సాయంత్రం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కి చేరుకొంటారు.రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. గూడూరు, సూళ్లూరుపేట,
సర్వేపల్లి ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి నియోజక
వర్గాల్లో విస్తారంగా పర్యటిస్తారు.

వరదల్లో చిక్కుకొన్న అభాగ్యులను ఆయన కలుసుకొంటారు. పంట
నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడతారు. ప్రజల ఆవేదలన్ని అడిగి తెలుసుకొంటారు.
బాధితులకు సరైన పరిహారం లభించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తారు. 

Back to Top