జగనన్న మాట తప్పడు..మడమ తిప్పడు - యార్లగడ్డ వెంకట్రావ్‌

విజయవాడ: వైయస్‌ జగన్‌మాట తప్పడు..మడమ తిప్పడని గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావ్‌ అన్నారు. గన్నవరం సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గన్నవరం అభివృద్ధి చెందిందన్నారు. అప్పట్లోనే వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేశారన్నారు. ప్లై ఓవర్‌ ఏర్పాటు చేసిన ఘనత వైయస్‌ఆర్‌ అని కొనియాడారు. పోలవరం కాల్వకు శంకుస్థాపన చేసిన ఘనత ఆయనదే అన్నారు. మహానేత చనిపోకపోయి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు. ఈ రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్‌కు ఐటీ హబ్‌ అంటూ ప్లగ్‌ పేరుతో రాయితీలు ఇచ్చి ఐటీ పరిశ్రమలు తెచ్చామన్నారు. లోకేష్‌ తెచ్చింది ఐటీ పరిశ్రమలు కాదని, కాల్‌ సెంటర్లు అని వివరించారు. వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రంలో అత్యధిక మంది అభిమానులు ఉన్న నాయకుడు వైయస్‌ జగన్‌ మాత్రమే అన్నారు. సినిమా హీరోలు కూడా ఏమాత్రం సరిపోరన్నారు. మాట తప్పడు మడమ తిప్పని నేత అన్నారు. నాడు ఇచ్చిన మాట కోసం సోనియాను ఎదురించి, కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారన్నారు. మాట కోసం నిలబడిన వ్యక్తికి ఒక్కసారి రాజ్యాధికారం ఇవ్వమని కోరారు. కృష్ణా జిల్లాలో ఏ నాయకుడికి లభించని సాదర స్వాగతం ఒక్క వైయస్‌ జగన్‌కే దక్కిందన్నారు. ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర..విజయవాడకు వచ్చేసరికి జైత్రయాత్రగా మారిందన్నారు. మన నియోజకవర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం, దాసరి బాలవర్ధన్‌ వీరంతా కూడా సౌమ్యులన్నారు. వీరిలో ఏ ఒ క్కరికి అవినీతి మరక లేదన్నారు. గన్నవరం ఇది వరకు ఏయిర్‌పోర్టుకు ఫెమస్‌ అయితే ఇవాళ ఇసుక దోపిడీకి అడ్డగా మారిందన్నారు. బ్రహ్మలింగం చెరువు, కొండపోలూరు, పురుషోత్తంపట్నం వంటి గ్రామాల్లో మట్టిని తవ్వి అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. 104, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ గతం లాగే అమలు కావాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. దుట్టా రామచంద్రారావుతో కలిసి పనిచేస్తానని, ఇద్దరం ఒక్కటే అని చెప్పారు.
Back to Top