వైయ‌స్ జ‌గ‌న్ రైజ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో చ‌లివేంద్రం ఏర్పాటు

ప్ర‌కాశం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పేరుతో ఏర్పాటైన జ‌గ‌న్ రైజ‌ర్స్ సేవా కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేసింది. జ‌గ‌న్ రైజ‌ర్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో చ‌లివేంద్రం ఏర్పాటు చేశారు. కందుకూరు టౌన్ లోని రాజన్న విగ్రహం దగ్గర జగన్ రైజర్స్ ఏర్పాటు చేసిన ఈ చ‌లివేంద్రాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తుమాటి మాధ‌వ‌రావు, జ‌గ‌న్ రైజ‌ర్స్ స్టేట్ సెక్ర‌ట‌రీ షేక్ ర‌ఫీ ప్రారంభించారు. వేస‌వి ఎండ తీవ్ర‌త దుష్ట్యా గ్రామీణ ప్రాంతాల నుంచి ప‌ట్ట‌ణానికి వ‌చ్చే ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఈ చ‌లివేంద్రాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు ర‌ఫీ తెలిపారు. ప్ర‌జ‌లు ఈ చ‌లివేంద్రాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. జ‌గ‌న్ రైజ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో మ‌రిన్ని సేవా కార్య‌క్ర‌మాలు త‌ల‌పెడుతున్న‌ట్లు చెప్పారు. కార్యక్రమంలో జగన్ రైజర్స్ ప్రకాశం జిల్లా కో-ఆర్డినేటర్ ప్రత్తిపాటి నరసింహరావు, కందుకూరు కన్వీనర్ షేక్ సుల్తాన్, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top