వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పార్టీ తూర్పుగోదావ‌రి జిల్లా అధ్యక్షుడు, శాస‌న‌స‌భ లో డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్  జ్యోతుల నెహ్రు కుటుంబాన్ని పరామర్శించారు. ఈరోజు ఉదయం ఆయన  హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట  మీదగా ఇర్రిపాక వెళ్లారు. ఇటీవల నెహ్రు సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా వైఎస్ జగన్తో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జ్యోతుల నెహ్రును పరామర్శించారు. జ్యోతుల కుటుంబ స‌భ్యుల్ని పేరు పేరునా ప‌ల‌క‌రించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ‌కు వ‌చ్చిన పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల్ని వైఎస్ జ‌గ‌న్ ప‌ల‌క‌రించారు. మ‌ర్యాద పూర్వ‌కంగా వారికి అభివాదాలు తెలిపారు. 
Back to Top