జ‌గ‌న్ సీఎం కావాల‌ని కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు

చౌడేపల్లె (చిత్తూరు):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి కావాలని కోరుతూ చౌడేపల్లె మండలం ఏ.కొత్తకోట సెగ్నెంట్‌ ఎంపిటీసీ ధనలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం కాలినడకన తిరుమలకు బయలు దేరారు. ఆమె తన భర్త చెంగారెడ్డితో కలిసి మాట్లాడుతూ తన స్వగ్రామమైన దుర్గసముద్రం నుంచి అనుచరులతో తిరుమలకు కాలినడన వెళ్ళి జగన్‌సీఎంకావడంతో పాటు ఎమ్మె ల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయ్యేందుకు స్వామివారి కృప కావాలని కోరుతూ తిరుమలకు వెళ్తున్నట్లు చెప్పారు.రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం రావడం ఖాయమని పెద్దిరెడ్డి మంత్రిగా ప్రజలకు సేవలందించి అన్నివిధాలుగా రాష్ట్రాన్ని అభివృద్దిదిశపై తీసుకెళ్తారని ధీమా వ్యక్తంచేశారు.

Back to Top