జాతీయ జెండాను ఆవిష్కరించిన షర్మిల

కూడేరు:

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి షర్మిల ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా ముద్దలాపురం గ్రామ సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, శ్రీమతి లక్ష్మీపార్వతి, తదితరులు పాల్గొన్నారు. గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది.

Back to Top