ఆడకూతురు పట్ల ఇలా వ్యవహరించడం ధర్మమేనా?’

మీడియా చిట్‌చాట్‌లో  వైయ‌స్  జగన్‌ 
ఏపీ అసెంబ్లీ:  చేయ‌ని నేరానికి ఇప్ప‌టికే ఏడాది పాటు శిక్ష అనుభ‌వించిన ఎమ్మెల్యే రోజాపై ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం న్యాయ‌మేనా, ఒక ఆడకూతురు పట్ల ఇలా వ్యవహరించడం ధర్మమేనా? అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్రశ్నించారు. అసెంబ్లీ వాయిదా అనంత‌రం ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ అంశంపై వైయ‌స్ జ‌గ‌న్ మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ‘ఒక జడ్జి ముందుకు ఒక కేసు వస్తుంది. వీళ్లు తప్పని వాళ్లు... వాళ్లు తప్పని వీళ్లు...ఇరుపక్షాలు వాదనలు వినిపించుకుంటాయి. అన్ని విన్న తర్వాత జడ్జి ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాగే రోజా విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు శిక్ష కూడా పూర్తయింది. శిక్ష పూర్తయ్యాక కూడా మళ్లీ గతంలో ఏదో జరిగిందని పాత విషయాన్ని తిరగదోడడం కరెక్టేనా? ఒకే అంశానికి సంబంధించి ఎన్నిసార్లు చర్యలు తీసుకుంటారు?. రాజకీయాలు పక్కనపెట్టి ఈ విషయాన్ని ఆలోచించాలని వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు.
Back to Top