ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా 72వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. విశాఖ జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిర్వ‌హిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ అక్క‌డ నిర్వ‌హించిన వేడుక‌ల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డివెంక‌టేశ్వ‌ర్లు జెండాను ఆవిష్క‌రించారు. ఏపీ రాజ‌ధాని విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ ఫలాలు అందరికీ అందడంలేదని పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థసారథి అన్నారు. 72 ఏళ్లు నిండినప్పటికి ఈ పరిస్థితి ఉండడం బాధకరమని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కృష్ణా జిల్లా, విజయవాడ కీలక భూమిక పోషించాయని, మహాత్ముని స్ఫూర్తితో వైయ‌స్ఆర్‌సీపీ  ముందుకెళుతుందని మల్లాది విఘ్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు పైలా సోమినాయుడు, బొప్పన భవన కుమార్‌, ఎమ్‌వీఆర్‌ చౌదరి, జానారెడ్డి, పుల్లారావు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.


Back to Top