చంద్రబాబు లాంటి మోసకారిని క్షమిస్తే ఇంకా మోసాలు చేస్తారు


ప్రతి విషయంలోనూ మోసం దగా చంద్రబాబు నైజం
హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు.
దళారీల నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టం



పెదనందిపాడు:  చంద్రబాబు లాంటి మోసకారిని క్షమిస్తే, మరింతగా రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడుతూ  ప్రజలను నిరంతరం వంచిస్తూనే ఉంటారని , ఇటువంటి వారికి బుద్ది చెప్పాలని ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రతి అడుగు మోసం, వంచన, అక్రమమనే పునాదులతోనే ఉంటుందని మండిపడ్డారు. 
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పెదనందిపాడులో సోమవారం నిర్వహంచిన బహిరంగ సభలో ఆయన  ప్రసంగించారు. 
 ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

పెదనందిపాడు,ప్రత్తిపాడు , అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామంటూ నాతో పాటు అడుగులేసిన వారందరికీ కృతజ్ఞతలు. 

ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంకట పరిస్థితి ,అయితే కరువు  ఉంటుంది, లేదంటే వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజి, నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువలను ఆధునీకరించకపోవడం వల్ల పంట పొలాలు మునిగిపోతుంటాయి, చివరి భూములకు నీళ్లు రాని పరిస్థితి ఉంది.

ఇక్కడి  రైతన్న బాధలు కనీళ్లు తెప్పిస్తాయి.  30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలను  ఆధునీకరించేందుకు పనులు ఆగిపోయాయి. రైతులు 4 ఏళ్లుగా రైతులు అడుగుతున్నా, విజ్ఞప్తిలు చేస్తునా ఎవరూ పట్టించుకోలేదు. 
గుంటూరు చానల్‌ ఆధునీకరించి, పొడిగించాలని చాలా కాలం నుంచి డిమాండ్‌ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పాపురం ఛానల్‌ కు చంద్రగ్రహణం పట్టింది. దివంగత నేత హయాంలో దాదాపు 65 కోట్లు మంజూరు చేసి , 10 శాతం పనులుపూర్తి అయినప్పటికీ, ఇవాల్టికి ఒక్క అడుగు ముందుకు పడని దుస్థితి ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు.
పెదనందిపాడు బ్రాంచి కెనాల్‌ తుర్లపాడు నుంచి 300 కోట్ల అంచనాలతో  సర్వే కూడా పూర్తి చేశారు.  ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దాదాపు 35 వేల ఎకరాలకు సాగునీరి అందించే అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు.


నల్లమాడ డ్రైన్‌ ఆధునీకకరించే పనుల్లో దివంగత  వైయస్‌ ఆర్‌ హయాంలో  115 కిమీలలో పనుల్లో 85 కిలోమీటర్ల పనులు పూర్తి అయినా, మిగిలినవి పట్టిచుకోకపోవడంతో, ప్రతి ఏటా ముంపు బారిన పడుతున్నారు.

నియోజకవర్గంలో 98 గ్రామాలు ఉంటే, 80 శాతం గ్రామాలు మంచినీటి కోసం అల్లాడుతున్నాయి. గ్రామాల్లో చెరువుల్లో ఉన్నాయి. మట్టిని దోచుకునేందుకు చెరువులను తవ్వేస్తున్నారు. మంచినీరు చెరువులు ఉప్పునీటి మయం అవుతున్నయాంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
డ్రమ్ము నీటిని రూ100  చెల్లించి కొన్నుక్కోవల్సిన దారుణమైన దుస్థితి ఉంది.
అమరావతి 100కోట్ల నుంచి పైప్‌ లైన్లతో మంచినీరు అందించవచ్చన్న ప్రతిపాదనలున్నా వాటిని పట్టించుకోవడం లేదు.
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో, రైతులు అవస్థలు పడుతున్నారు. 4 ఏళ్ల పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లభించలేదు.ఉత్పత్తిఖర్చు కంటే చాలా తక్కువ ధరలకు కూడా అమ్ముడు పోక రైతులు నానాపాట్లు పడుతున్నారు. వరి పత్తి, మిర్చి, పెసలు, మొక్కజొన్న, పసుపు, కందులు ఇలా ఏ పంట చూసినా గిట్టుబాటు ధరలరావడం లేదని జగన్ మోహన్ రెడ్డి వివరించారు. 

కేవలం రైతన్న దగ్గరకు వచ్చేసరికే రేట్లు ఉండవనీ, అవి రైతుల చేతుల్లో నుంచి దళారీల చేతుల్లోకి వెళితే చాలు వాటి ధరలు రెండు మూడు రెట్లు పెరిగిపోతాయన్నారు. ఈ పరిస్థితికి కారణం దళారీల నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే . ఇది మన కర్మ దురదృష్టం.

 హెరిటేజ్ షాపుల్లో అమ్మడానికి రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి చంద్రబాబు తానే దళారై వ్యవహరిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలుచేసి, మూడింతలు, నాలిగింతలు రేట్లకు ప్రజలకు అమ్ముతుంటారు.
నాలుగేళ్లుగా రైతన్నలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. 

ప్రజల్లో  ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

బ్యాంకుల్లో తనఖాలో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే, వ్యవసాయరుణాలు భేషరతుగా మాఫీ కావాలంటే బాబు కావాలన్నారు. నాలుగేళ్లు గడిచిపోయాయి, బంగారం ఇంటికి వచ్చిందా? ఇంటికి రాలేదు. బ్యాంకులోళ్లు పంపిస్తున్న వేలం నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయి.
ఈ పెద్దమనిషి 82 వేల కోట్ల రుణమాఫీ చేస్తామంటూ రైతులను మోసం చేసి,  వడ్డీలకు సరిపోని మొత్తంతో పూర్తిగా మాఫీ చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. 
అంతే కాకుండా గతంలో రైతులకు అందే వడ్డీలేని రుణాలు కూడా అందకుండా చేసి, అన్యాయం, మోసం అన్న పునాదులపై రైతన్నలతో చెలగాటమాడుతున్నారు. 
ప్రతి అక్కా చెల్లెమ్మను మోసం చేశారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను రుణమాఫీ ఒక్క రూపాౖయెనా మాపీ అయ్యిందా, నోరు తెరిస్తే బొంకుతారు, అక్కచెల్లెమ్మలు కేరింతలు కొడుతున్నారంటూ సంతోషంగా ఉన్నారని ప్రచారం చేస్కుకుంటారు. 
ఎన్నికల్లో గెలవడానికి చిన్నాపెద్దా, అక్కా చెల్లి అనే తేడాలేమీ లేవు ఈ పెద్దమనిషికి మోసం చేయడమే వంచించడమే పని. 
 జాబు రావాలంటే బాబు రావాలంటూ ప్రతి ఇంటికి తన మనుషులను పంపించి మరీ ప్రచారం చేసుకున్నారు. 
ఇంటింటికి ఉద్యోగం, లేక ఉపాథి ఇవ్వకపోతే 2 వేలు ఇస్తామన్నాడు, ఇంతవరకు ప్రతి ఇంటికి 94 వేల బాకీ పడ్డారు. 
చంద్రబాబు ఎప్పుడైనా కనిపిస్తే అడగండి...94 వేలు బాకీ సంగతి ఏమిటని అని గట్టిగా ప్రశ్నించాలంటూ పిలుపునిచ్చారు.  
దేశంలో ఎక్కడా లేనట్లుగా మన రాష్ట్రంలో లీటరు పెట్రోలు , డీజిలుపై అదనంగా 7 రూపాయలు వసూలు చేస్తూ జేబులకు చిల్లులు పెడుతున్నారు.

పిల్లలు తాగి చెడిపోతున్నారంటూ , అధికారంలోకి రాగానే మందు తగ్గిస్తానన్న చంద్రబాబు, ప్రతి గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంటు లేకున్నా, మందు షాపు లేని గ్రామం  లేదు. ఫోన్‌ కొడితే  ఇంటికి మందు తీసుకుని వచ్చే హైటెక్‌ పాలన జరుగుతోంది.

నాలుగేళ్ల క్రితం కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని అన్న పెద్దమనిషి, అధికారంలోకి రాగానే బిల్లులు తగ్గిస్తానన్నారు. ఆయన సిఎంకాక మునుపు తక్కువగా వచ్చే కరెంటు బిల్లులు , ఇప్పుడు 3,4 రెట్లు పెరిగిపోయాయి.

కరెంటోళ్లు నేరుగా వచ్చి, పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. ఇదే 4 సంవత్సరాలుగా మనం చూసిన పాలన.

ఎడాపెడా ఆర్టీసీ కరెంటు, ఇంటి పన్నులు ఏడాపెడా బాదుడు చూశాం.
చంద్రబాబు హయాంలో చూసిందేమిటంటే అవినీతిని చాలా బాగా చూశాం.
పైన ఆయన కూర్చుని కాంట్రాక్టర్లు, మద్యం, కరెంటు కొనుగోళ్లు అన్నింటిని మింగేసే కార్యక్రమం చేస్తే, కిందేమో జన్మ బూమి కమిటీలను పందికొక్కుల్లాగా వదిలేస్తారు, 
ఫించను కావాలంటే మీర ఏపార్టీ వారని అడుగుతున్నారు ఆఖరికి మరుగుదొడ్లకు కూడా లంచాలు తీసుకుంటున్న దారుణమైన పాలన ఉంది.
చంద్రబాబు మోసాలు, అన్యాయాల్లో అన్నింటికంటే  ఘోరం ప్రత్యోక హోదాను తాకట్టు పెట్టడం .

ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నారు. 2016 సెప్టెంబరులో అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటన చేసి న వెంటనే, మంత్రులను ఎందుకు తప్పించలేదు. ఆరోజు జైట్లీను పొగిడి, అదే స్టేట్‌ మెంట్‌ను జైట్లీ మరోసారి చెపితే, కొత్తగా ప్లేట్లు ఫిరాయించి ఏదో జరిగిపోయిందంటూ సన్నాయి నొక్కులు పోతున్నారు. 
ప్రతి విషయంలో మోసం, దగా, చిత్తశుద్ధిలేని పాలన మనం చూస్తున్నాము.

సంవత్సరంలో జరబోయే ఎన్నికల్లోమీకు అబద్దాలు చెప్పే నాయకులుగా, మోసాలుచేసే వారు కావాలా ఒకసారి ఆలోచించుకోవాలి, 
ఈ వ్యవస్థ బాగుపడాలి, చెడిపోయిన ఈరాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి, మైకు పట్టుకుని ఫలానాది చేస్తానని చెప్పిన వ్యక్తి చేయలేకపోతే ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి, అప్పుడే విశ్వసనీయత వస్తుంది.

అప్పుడే నిజాయతీ అనే పదానికి అర్థం వస్తుంది. చంద్రబాబు నాయుడి లాంటి మోసకారిని క్షమిస్తే, ఆయన చేసిన మోసాలని క్షమిస్తే , ఆయన ఇంకా రెచ్చిపోయి, మోసాలకు పాల్పడతారు. 

ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చే 3 వేలు తీసుకోండి, 5 వేలు గుంజండి, ఓటు మాత్రం మనసు సాక్షిగా వేయాలంటూ పిలుపునిచ్చారు. 
ఈసందర్భంగా నవరత్నాల్లో పేదలకు గృహనిర్మాణం, ఫించను పథకాల గురించి వివరించారు.

Back to Top