నన్ను పావుగా వాడుకున్నారు: మోపిదేవి

హైదరాబాద్ నవంబర్ 15, 2013:

మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. భారీగా అనుచరగణం వెంట రాగా శుక్రవారం నాడు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని  ఇరికించేందుకు తనను పావుగా వాడుకున్నారని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ తనను ఇరికించిందని తెలిపారు. శ్రీ వైయస్  జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే ఎవరో ఒక మంత్రిని తప్పనిసరిగా అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో బలహీన వర్గాలకు చెందిన తనను అరెస్టు చేశారనీ, ఆ పార్టీలో మనుగడ సాగించలేననే ఉద్దేశంతోనే తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాననీ వివరించారు. అనేక సందర్భాల్లో ఈ సమస్యను తాను నాయకుడి దృష్టికి తీసుకెళ్లినా, తాను అరెస్టయిన మరుక్షణమే రమణ అనే వ్యక్తితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నట్లు వ్యవహరించారని , కష్టకాలంలో తనకెవరూ అండగా నిలబడలేదని అన్నారు. పీసీసీ నాయకులు, ముఖ్యమంత్రి, సహచర మంత్రులు  దూరంగా మెలిగారని  ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top