వైయ‌స్‌ఆర్‌ కుటుంబానికి విశేష స్పందన

కర్నూలు:  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వైయ‌స్‌ఆర్‌ కుటుంబ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందల లభిస్తోందని, ఆక్టోబర్‌ రెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల కుటుంబాలకు వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో చోటు కల్పించినట్లు  పార్టీ కర్నూలు జిల్లా అదనపు పరిశీలకుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వైయ‌స్‌ఆర్‌ కుటుంబ కార్యక్రమాన్ని నిర్వహించామని, అయితే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండడంతో మరో పది రోజులపాటు కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు. పండుగలు, వరుస సెలవులతో కొన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం సక్రమంగా జరగలేదని, ఈ పది రోజుల్లో కోటి కుటుంబాలకు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వాన్ని ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటిన ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగకపోగా 10–15 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిలో వారు దోచుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారని విమర్శించారు.లంచాలు, కమిషన్లు వచ్చే పనులు మాత్రమే అవుతుండడంతో పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని, ఒక్క అనంతపురంలోనే 23 మంది చనిపోవడం బాధాకరమన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. శ్రీశైలంలో నీరున్న సీమ రైతుకు భరోసా ఇచ్చే నాయకుడు, అధికారులు కరువయ్యారన్నారు. వెలుగోడు నుంచి తెలుగుగంగకు నీటిని విడుదల చేస్తే కర్నూలు, కడప జిల్లాల్లో సుమారు 80 వేల ఆయకట్టులో వరి ధాన్యం పండుతుందని, అయినా ప్రభుత్వం మాత్రం అరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించడం తీవ్ర అన్యాయమన్నారు. సీఎం చంద్రబాబునాయుడు కోస్తాపై ప్రేమను చూపుతూ సీమపై నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇక్కడి నీటిని తరలించుకోవడానికి చర్యలు తీసుకోవడంలేదన్నారు. కర్నూలు జిల్లాలో మూడున్నరేళ్లు ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని ఎందుకు నిర్వహించడలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీఎం అయితే రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు బీవై రామయ్య, శ్రీదేవి,హఫీజ్‌ఖాన్, ప్రదీప్‌రెడ్డి, నాగరాజుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు
Back to Top