ధర్మవరం తరలివెళ్లిన వైయస్సార్‌సీపీ శ్రేణులు

బత్తలపల్లిః

ధర్మవరం పట్టణంలో  న్యాయమైన కోర్కెల సాధన కోసం తలపెట్టిన చేనేత దీక్షలను ఉపసంహరించేందుకు మంగళవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సభకు బత్తలపల్లి మండలం నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఆపార్టీ నేతలు ఏర్పాటు చేసిన వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లారు. మండల కేంద్రమైన బత్తలపల్లి నుంచి  పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు. జెడ్పీటీసీ అక్కిం నరసింహులు, వైస్‌ ఎంపీపీ గొల్లపల్లి వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్‌ బగ్గిరి బయపరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌లు ముష్టూరు నరసింహారెడ్డి, గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, సర్పంచులు సానే సూర్యనారాయణరెడ్డి, ముల్లగూరి సంజీవు, లక్ష్మీనారాయణ, ఈశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గజ్జెల వెంగళరెడ్డి, మాతంగి రామాంజనేయులు, బగ్గిరి రామ్మోహన్‌రెడ్డి, వడ్డె క్రిష్టా, వివిధ విభాగాల నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెళ్లారు.

Back to Top