వైయస్‌ఆర్‌సీపీ నేతృత్వంలో భారీ విద్యుత్‌ ప్రభ

గుంటూరు:  పంటపొలాలు సాగు చేసుకునేందుకు విస్తారంగా వర్షాలు కురిసి పంటలు పండే విధంగా ఆశీర్వదించాలని కోటప్పకొండలో కొలువై ఉన్న త్రికోటేశ్వర స్వామిని వేడుకుంటున్నామని వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్‌ అన్నారు. మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ విద్యుత్‌ ప్రభ నాల్గో వార్షికోత్సవ సభ ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన  కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఆయన హాజరై పాల్గొని ప్రసంగించారు. రైతులు చల్లగా ఉంటే అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారన్నారు. ప్రధాన ప్రతిపక్షంలోఉన్న వైయస్‌ఆర్‌ సీపీకి చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సమషి ్టకృషితో గత నాలుగు సంవత్సరాలుగా లక్షలాది రూపాయిల వ్యయంతో విద్యుత్‌ ప్రభను నిర్మించటం విశేషమన్నారు. ఈ సందర్భంగా ఇందుకు కృషి చేసిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ప్రభల నిర్మాణం చేసి కోటప్పకొండ తిరునాళ్ళలో వైయస్‌ఆర్‌ సీపీ విద్యుత్‌ ప్రభ ప్రత్యేక ఆకర్షణంగా నిలవటం విశేషమన్నారు. ఇదే విధానాన్ని కొనసాగించి భవిష్యత్‌లో వైయస్‌ఆర్‌సీపీ నేతృత్వంలో మరిన్ని ప్రభలను నిర్మింప చేస్తారని ఆకాంక్షించారు.

Back to Top