అవినీతి బయటపడుతుందనే గృహనిర్బంధనం

దాచేపల్లి(గుంటూరు): కృష్ణా పుష్కర పనుల్లో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు ఆధారాలతో సహా దాచేపల్లిలో జరిగే చర్చావేదికకు వెళ్లేందుకు బయలుదేరిన  మాచర్ల వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని భయపడిపోయిన పచ్చపార్టీ ...ఎమ్మెల్యేను చర్చావేదిక వద్దకు రాకుండా అడ్డుకునే కుట్ర చేసింది. అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని అన్నసంగతి తెలిసిందే. సవాల్ ను ప్రతిసవాల్ గా స్వీకరించిన పిన్నెల్లి అవినీతిని బయటపెట్టేందుకు  సిద్ధమయ్యారు. దీంతో, ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి పిన్నెల్లిని  ఇంటినుంచి బయటకు రాకుండా నిర్బంధనం చేసింది. మాచర్లలోని ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంటి ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. చర్చావేదికకు వెళ్లేందుకు యత్నిస్తున్న పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లికి చెందిన వైయ‌స్సార్‌సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top