హోదా కోసం పోరాటానికి కదలిరండి..!

నంద్యాలః ప్రత్యేకహోదా సాధన కోసం ఈనెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిఒక్కరూ మద్దతు నిలవాలని..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించుకునేందుకు అందరూ కలిసిరావాలని కోరారు.

నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో భూమా నాగిరెడ్డి  మాట్లాడుతూ..పోరాటంలో విద్యార్థులు ముందు నిలవాలన్నారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ,ప్రతి ఒక్కరికి లబ్ధి కలుగుతుందని భూమా తెలిపారు.  
Back to Top