'సమైక్య' సభకు తెలంగాణ నుంచి జనం వెల్లువ

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా, ఏకపక్షంగా విభజించాలని కాంగ్రెస్ ‌నిరంకుశంగా, ఏకపక్షంగా వ్యవహరించిందని, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న'సమైక్య శంఖారావం' సభకు తెలంగాణ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వ‌చ్చారు. మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నుంచి కార్యకర్తలు వేలాదిగా‌ కదిలి శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయా జిల్లాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే అన్ని ప్రాంతాల ప్రజలతో చర్చించి త‌గిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు వారు తెలిపారు.

మరోపక్కన సమైక్య శంఖారావానికి వస్తున్న సమైక్యవాదులను... ఆందోళనకారులు అడ్డుకోకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 44వ జాతీయ రహదారిపై అలంపూర్ చౌరస్తా నుంచి కొత్తూరు వరకూ పోలీసులు భారీ సంఖ్యలో ‌మొహరించారు. అలంపూర్, గద్వాల, మదనాపురం, మహబూబ్నగర్, జడ్చర్ల, షా‌ద్‌నగర్ తదితర రైల్వేస్టేషన్లలో పోలీసులు ‌శుక్రవారం సాయంత్రం నుంచే పహారా నిర్వహిస్తున్నారు.

Back to Top